Raghava Constructions | రాఘవ కన్స్ట్రక్షన్స్కు సర్కార్ ఆపన్న హస్తం!.. ఎస్టీపీల కాంట్రాక్ట్‌లో లీడ్ పార్ట్నర్గా అనుమతిస్తూ జీవో
Raghava Constructions | రాఘవ కన్స్ట్రక్షన్స్కు ప్రభుత్వం ఇష్టానుసారం కాంట్రాక్ట్‌లు కట్టబెడుతున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడ టెండర్ జరిగినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాఘవ సంస్థకు దక్కేలా చర్యలు తీసుకొంటున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Raghava Constructions | హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): రాఘవ కన్స్ట్రక్షన్స్కు ప్రభుత్వం ఇష్టానుసారం కాంట్రాక్ట్‌లు కట్టబెడుతున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడ టెండర్ జరిగినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాఘవ సంస్థకు దక్కేలా చర్యలు తీసుకొంటున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంస్థ ప్రభుత్వంలో నంబర్ 2గా వెలుగొందుతున్న మంత్రికి చెందినది కావడంతో రాఘవకు కాంట్రాక్ట్‌లు వర్తించేలా జీవోలు జారీ అవుతున్నాయనే విమర్శలున్నాయి. తాజాగా అమృ త్ 2.0 కింద ఎస్టీపీ (సీవేజీ ట్రీట్‌మెంట్‌ప్లాంట్- మురుగునీటి శుద్ధి కర్మాగారం)లు నిర్మించేందుకు జలమండలి పిలిచిన టెండర్లలో ఏకంగా 51% షేర్ లభించేలా జీవో విడుదల చేసి రాఘవకు లబ్ధి చేకూర్చినట్టు సమాచారం.
సాంకేతిక అర్హతలు లేకున్నా..
హైదరాబాద్‌లో మురుగునీటి శుద్ధి, మూసీలో కాలుష్య నియంత్రణకు అమృత్ 2.0లో భాగంగా సుమారు రూ.4 వేల కోట్లతో 39 ఎస్టీపీలు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా 22 ఎస్టీపీల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించారు. దీని అంచనా వ్యయం రూ.1,906.44 కోట్లుగా నిర్ణయించారు. టెండర్లో నేరుగా పాల్గొనేందుకు రాఘవ కన్స్ట్రక్షన్స్కు సాంకేతిక అర్హతలు లేవు. దీంతో బీవీఎస్ఆర్, ఎస్ఎస్జీ కంపెనీలతో కలిసి రాఘవ సీవరేజీ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో టెండర్ దక్కించుకున్నారు. ఇందులో రాఘవ కన్స్ట్రక్షన్స్కు 26%, ఎస్ఎస్జీ ఇన్‌ఫ్రాటెక్‌కు 23%, బీవీఎస్ఆర్కు 51% వాటా ఉండేది.
తాజా గా రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ మిగిలిన 2 సంస్థలతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం తన వాటాను 51 శాతానికి పెంచుకొనేందుకు అనుమతులిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎస్టీపీల నిర్మాణంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ లీడ్ పార్ట్నర్గా అవతరించింది. ఎస్టీపీల నిర్మాణంలో అనుభవం లేని రాఘవ కన్స్ట్రక్షన్స్ను జాయింట్ వెంచర్ ద్వారా 51% వాటాను పెంచుకొనేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

