హైదరాబాద్, మార్చి 9 (నమస్తేతెలంగాణ): కేంద్రం నిర్వహిస్తున్న బొగ్గుబ్లాక్‌ల వేలం ప్రక్రియలో పాల్గొనేందుకు సింగరేణికి అనుమతించాలని ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఎంవోఐఏ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, జనక్‌ప్రసాద్, లక్ష్మీపతిగౌడ్ డిమాండ్ చేశారు. బొగ్గుబావులు దక్కకుంటే కంపెనీ మూతపడి, కార్మికుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారతాయని ఆందోళన వ్యక్తంచేశారు.
ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిలో కీలకభూమిక పోషిస్తున్న సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నదని అన్నారు.