కవాడిగూడ, ఫిబ్రవరి 5: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ మాల సంఘాల జేఏసీ నేతలు ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి వైఖరిని వ్యతిరేకిస్తూ జేఏసీ చైర్మన్ చెన్నయ్య ఆధ్వర్యంలో పలువురు నాయకులు రోడ్డుపై భైఠాయించారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వాగ్వాదం చోటుచేసుకుంది. చెన్నయ్య మాట్లాడుతూ మాలలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌లోని మాల ప్రజాప్రతినిధులు పార్టీ నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకోకపోతే కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదని
హెచ్చరించారు.