Free bus for women |రామాయంపేట, మార్చి 13: ఉచిత బస్సు ప్రయాణంతో పరిమితికి మంచి ప్రయాణికులు బస్సులో ఎక్కడంతో కండక్టర్ స్పృహ తప్పిపడిపోయింది. ఈ ఘటన బుధవారం మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్ డిపోకు చెందిన బస్సు రామాయంపేట నుంచి బయలుదేరింది.
పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో కండక్టర్ అనిత టికెట్ ఇస్తుండగా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఛాతీ లో నొప్పి వస్తుందంటూ డ్రైవర్‌కు చెప్పడంతో కంట్రోలర్ బాబుసింగ్‌కు సమాచారం ఇచ్చారు. ప్రయాణికుల ను దించేసి, అదే బస్సులో కండక్టర్‌ను రామాయంపేటలోని ప్రభుత్వ దవాఖానకు వైద్యం కోసం తీసుకెళ్లారు.