శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Nov 29, 2020 , 15:42:51

యాదాద్రిలో భక్తుల కోలాహలం

యాదాద్రిలో భక్తుల కోలాహలం

యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో భక్తుల కోలాహలం నెలకొంది. కార్తీకమాసంతోపాటు ఆదివారం సెలవుదినం కావడంతో భక్తుల సందడి నెలకొంది. పుష్కరిణి, కల్యాణకట్ట, ప్రసాదాల విక్రయశాల, తిరు వీధులు భక్తులతో సందడిగా మారాయి. ఉదయం స్వామివారికి తలనీలాలు సమర్పించి, విష్ణు పుష్కరిణిలో స్నాన మాచరించిన భక్తులు క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్లు నిత్యకల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం శ్రీవారి దర్శనం కోసం క్యూలెన్లలో బారులు తీరారు.