హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): అతి త్వరలో ప్రారంభం కానున్న నీరా కేఫ్‌కు అనుబంధంగా ఉన్న చిల్లింగ్ప్లాంట్ల పనులను త్వరగా పూర్తి చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులను మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయంలో సంబంధిత శాఖా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు.
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారుల పనితీరును మెరుగు పరచుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో గుడుంబా నిర్మూలన 100శాతం పూర్తిగా జరగాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు. గుడుంబాతో ఏ ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకూడదని, గుడుంబా తయారీ అమ్మకందారులపై ఉకుపాదం మోపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, అజయ్ రావు, డేవిడ్ రవికాంత్, శాస్త్రి, చంద్రయ్య, విజయ్ భాసర్ తదితరులు పాల్గొన్నారు.