Mission Kakatiya | దేశవ్యాప్తంగా మిషన్ కాకతీయ.. తాజా బడ్జెట్లో ప్రస్తావన
Mission Kakatiya | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలుచేసిన మిషన్ కాకతీయ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు తాజా బడ్జెట్లో అంశాన్ని ప్రస్తావించింది.
Mission Kakatiya | హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ) : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలుచేసిన మిషన్ కాకతీయ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు తాజా బడ్జెట్లో అంశాన్ని ప్రస్తావించింది. ఇప్పటికే కేసీఆర్ తీసుకొచ్చిన రైతుబంధు, కల్యాణలక్ష్మీ తదితర ఎన్నో పథకాలను కేంద్రం సహా పలు రాష్ర్టాలు ఇప్పటికే వివిధ పేర్లతో అమలుచేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కేంద్రం మరో పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 500 రిజర్వాయర్లు, అమృత్ సరోవర్లను సమగ్రాభివృద్ధి చేసి చేపల పెంపకాన్ని బలోపేతం చేస్తామని బడ్జెట్లో ప్రకటించడం తెలంగాణకు గర్వకారణం. ఇప్పటికే సోషియో ఎకనమిక్ సర్వే రిపోర్టులోనే కేంద్రం కాళేశ్వరం, మిషన్ కాకతీయ పథకాలను శ్లాఘించింది. తెలంగాణలో ఆయకట్టు విస్తీర్ణం అత్యల్ప కాలంలోనే అసాధారణ స్థాయిలో విస్తరించిందని వెల్లడించింది. 1.30కోట్ల ఎకరాల నుంచి 2.20కోట్ల ఎకరాలకు ఆయకట్టు పెరిగిందని తెలిపింది. తదనుగుణంగా కేంద్రం సైతం రిజర్వాయర్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు తాజా బడ్జెట్లో ప్రవేశపెట్టింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- KCR
- Mission Kakatiya
- Pm Modi
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

