ఎయిమ్స్‌పై పూటకో మాట
బీబీనగర్ ఎయిమ్స్‌పై కేంద్ర ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతున్నది. పార్లమెంట్ వేదికగా పచ్చి అబద్ధాలు పలుకుతున్నది. నిధుల కేటాయింపు, పూర్తయిన పనులపై రెండు నాలుకల ధోరణిని అవలంబిస్తున్నట్టు కేంద్రం ఈ నెల 25, 28 తేదీల్లో పార్లమెంట్‌కు సమాధానాలు స్పష్టం చేస్తున్నాయి.
- పార్లమెంట్లో కేంద్రం పచ్చి అబద్ధాలు
- నిధులు, పనులపై రెండు నాల్కల ధోరణి
- మంజూరైన నాలుగున్నరేండ్ల తర్వాత బీబీనగర్‌లో ఎయిమ్స్‌కు శంకుస్థాపన
- తెలంగాణపై వివక్షను పార్లమెంట్లో ఒప్పుకున్న నరేంద్రమోదీ సర్కారు
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): బీబీనగర్ ఎయిమ్స్‌పై కేంద్ర ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతున్నది. పార్లమెంట్ వేదికగా పచ్చి అబద్ధాలు పలుకుతున్నది. నిధుల కేటాయింపు, పూర్తయిన పనులపై రెండు నాలుకల ధోరణినిఅవలంబిస్తున్నట్టు కేంద్రం ఈ నెల 25, 28 తేదీల్లో పార్లమెంట్‌కు సమాధానాలు స్పష్టం చేస్తున్నాయి. ఎయిమ్స్ నిర్మాణాలపై బీఆర్ఎస్ ఎంబీ బడుగుల లింగయ్య యాదవ్‌తోపాటు ఎంపీలు ఎన్ రెడ్డప్ప, డాక్టర్ కళానిధి వీరాస్వామి అడిగిన ప్రశ్నలకు కేంద్రం పరస్పర విరుద్ధమైన సమాధానాలు ఇచ్చింది. వీటిని విశ్లేషిస్తే తెలంగాణ ఎయిమ్స్‌పై మోదీ సర్కారు ఎంత వివక్ష ప్రదర్శిస్తున్నదో కూడా అర్థమవుతుంది.
3 రోజుల్లో రూ.300 కోట్లు తగ్గాయి
బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణానికి రూ.1,365.95 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఈ నెల 25న తెలిపిన కేంద్రం.. అదే నోటితో ఈ పనులను రూ.1,028 కోట్లతో చేపట్టినట్టు శుక్రవారం చెప్పింది. అంటే కేవలం మూడు రోజుల్లోనే బడ్జెట్ సుమారు రూ.338 కోట్లు తగ్గిపోయింది.
3% పెరిగిన పనులు
బీబీనగర్ ఎయిమ్స్ కోసం ఇప్పటివరకు రూ.379.90 కోట్లు ఖర్చు చేశామని, పనులు 21 శాతం పూర్తయ్యాయని ఈ నెల 25న చెప్పిన కేంద్రం.. మూడు రోజుల తర్వాత బీబీనగర్ ఎయిమ్స్ పనులు 24% పూర్తయ్యాయని పేర్కొన్నది. అంటే.. మూడు రోజుల్లోనే పూర్తయిన పనులు 3% పెరిగాయన్నమాట.
నాలుగున్నరేండ్లకు శంకుస్థాపన
బీబీనగర్ ఎయిమ్స్‌ను 2018 డిసెంబర్ 17న మంజూరు చేసినట్టు తెలిపిన కేంద్రం.. ఈ నిర్మాణాలకు 2023 ఏప్రిల్ 8న శంకుస్థాపన చేసినట్టు చెప్పింది. అంటే.. ప్రాజెక్టు మంజూరైన నాలుగున్నరేండ్ల తర్వాత శంకుస్థాపన చేశారన్నమాట. ఈ పనులు మొదలై 20% పూర్తయ్యాక మళ్లీ శంకుస్థాపన చేయడం కేంద్రంలోనే బీజేపీ ప్రభుత్వానికే చెల్లింది. పోనీ కేంద్రం చెప్పినట్టు చూసినా.. పునాదిరాయి వేసిన మూడు నెలల్లోనే 21% పనులు పూర్తిచేసినట్టు లెక్క. ఇదీ హాస్యాస్పదమే.
బీబీనగర్ ఎయిమ్స్ మాత్రమే ఆలస్యం
తెలంగాణ పట్ల మోదీ సర్కారు వివక్ష చూపుతున్నట్టు కేంద్రం ఇచ్చిన సమాధానాలు స్పష్టం చేస్తున్నాయి. 2018లో తెలంగాణకు ఎయిమ్స్‌ను మంజూరు చేసిన కేంద్రం.. అదే ఏడాది హిమాచల్‌ప్రదేశ్‌కు కూడా ఓ ఇన్స్టిట్యూట్ను కేటాయించింది. దాని పనులు ఎప్పుడో పూర్తవడంతో నిరుడు అక్టోబర్‌లో జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత మంజూరైన ఎయిమ్స్‌ల నిర్మాణ పనులు సైతం బీబీనగర్ ఎయిమ్స్ కంటే వేగంగా జరుగుతున్నాయి. దీనిని బట్టి బీబీనగర్ ఎయిమ్స్‌ను కేంద్రం కావాలనే ఆలస్యం చేస్తున్నట్టు రుజువవుతున్నది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen kumar | మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచన
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

