‘కేంద్ర అధికారుల విభజన’ విచారణ వాయిదా
రాష్ట్ర విభజన నేపథ్యంలో పలువురు కేంద్ర సర్వీస్ అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన కేసు విచారణను హైకోర్టు రెండు వారాలపాటు వాయిదా వేసింది.
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన నేపథ్యంలో పలువురు కేంద్ర సర్వీస్ అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన కేసు విచారణను హైకోర్టు రెండు వారాలపాటు వాయిదా వేసింది. ప్రత్యూష్‌సిన్హా కమిటీ సిఫార్సులను సవాల్ చేస్తూ పలువురు అధికారులు క్యాట్ నుంచి ఉత్తర్వులు పొంది తెలంగాణలో కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ పిటిషన్లు దాఖలు చేసింది.
సీఎస్‌గా చేసిన సోమేశ్‌కుమార్‌ను ఏపీకి కేటాయించడాన్ని సమర్థిస్తూ గతంలో వెలురించిన తీర్పును డీజీపీ అంజనీకుమార్ సహా ఐదుగురు అధికారులకు వర్తింపజేయాలని కేంద్రం కోరింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. సోమేశ్‌కుమార్‌ను ఏపీకి కేటాయిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ తాము చేసిన అప్పీల్‌పై తుది ఉత్తర్వులు వెలువడే వరకు ఇతర అధికారుల కేసుల విచారణను వాయిదా వేయాలని కోరింది. రెండు వారాల తర్వాత విచారణ చేపడతామని జస్టిస్ అభినందకుమార్ షావిలి, జస్టిస్ పుల్లా కార్తీకతో కూడిన ధర్మాసనం సోమవారం ప్రకటించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

