హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఐపీఎస్ అధికారి అంజనీకుమార్‌పై ఉన్న సస్పెన్షన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఎత్తివేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.
ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదన్న అంజనీకుమార్ విజ్ఞప్తిని సీఈసీ పరిగణనలోకి తీసుకున్నట్టు వెల్లడించింది. డిసెంబర్ 3న పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి పిలిస్తేనే తాను వెళ్లానని అంజనీకుమార్ ఇచ్చిన వివరణతో ఈసీ ఏకీభవించింది.