Nallamala | మళ్లీ యురేనియం అంశం తెచ్చిన కేంద్రం.. అమ్రాబాద్‌లో బీజేపీ దిష్టిబొమ్మ దహనం
Nallamala | అమ్రాబాద్ : యురేనియం పేరుతో బీజేపీ మళ్లీ నల్లమలలో చిచ్చుపెట్టాలని చూస్తుండడంతో నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌లో బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నల్లమల ప్రాంతాన్ని కేంద్రం యురేనియం పేరుతో బహుళజాతి కంపెనీలకు అమ్మేందుకు కుట్ర చేస్తున్నదని ధ్వజమెత్తారు.
Nallamala | అమ్రాబాద్ : యురేనియం పేరుతో బీజేపీ మళ్లీ నల్లమలలో చిచ్చుపెట్టాలని చూస్తుండడంతో నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌లో బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. యురేనియం వ్యతిరేక జేఏసీ నల్లమల పోరాట సమితి అధ్యక్షుడు నాసరయ్య ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్లమల ప్రాంతాన్ని కేంద్రం యురేనియం పేరుతో బహుళజాతి కంపెనీలకు అమ్మేందుకు కుట్ర చేస్తున్నదని ధ్వజమెత్తారు.
కాగా మండలం బీకే ఉప్పునుంతల, తిర్మలాపూర్ తదితర గ్రామాల్లో సీపీఐ, ఎం, గిరిజన సంఘం నాయకులతో కలిసి పర్యావరణ రాష్ట్ర నేత నరసింహారావు పర్యటించారు. కొందరు బడాబాబుల కోసం దేశాన్ని, తెలంగాణను అమ్మేందుకు మోదీ కుయుక్తులు పన్నుతున్నాడని తీవ్రంగా మండిపడ్డారు. నల్లమల అటవీ ప్రాంతం ఇప్పుడే పురుడు పోసుకుంటున్నదని, వణ్యప్రాణి సంపదను, ఇక్కడి ప్రజలను, ఆవాసాలను నాశనం చేసేందుకు ఎంపీ లక్ష్మణ్‌తో యురేనియం అంశాన్ని లేవనెత్తిచ్చారని విరుచుకుపడ్డారు. కార్యక్రమాల్లో యురేనియం వ్యతిరేక జేఏసీ, సీపీఎం నేతలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

