హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తేతెలంగాణ): లగచర్లలో అమాయక గిరిజన రైతులపై మోపిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్యనాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గిరిజన రైతులను ఏకం చేసి వారి హకుల కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన గిరిజన సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. లగచర్లలో అర్ధరాత్రి రైతులను అరెస్టు చేయడం, వారిని అడ్డం పెట్టుకొని ఆడుతున్న నాటకంపై నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. పచ్చటి పొలాలను సాగు చేస్తున్న రైతుల భూముల్లో ఫార్మా కంపెనీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్లను ఏర్పాటు చేసే కుట్ర పన్నిందని విమర్శించారు.
న్నారు. కంపెనీల ఏర్పాటు యోచనను ప్రభుత్వం వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాలను, వారి సాగుభూములను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రాజెక్టులు, కంపెనీల ఏర్పాటు పేరుతో భూములను కొల్లగొడుతున్నాయని ఆరోపించారు. ముచ్చర్లలో భూముల్లో ఫోర్త్ సిటీ పేరుతో రేవంత్రెడ్డి సర్కారు రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగును కమ్మేసిందని ఆరోపించారు.