కొల్లాపూర్, నవంబర్ 21: ‘తనకు మత్స్య శాఖ మంత్రి పదవి ఇచ్చారు.. కానీ సరైన బడ్జెట్ ఇవ్వలేదు’ అంటూ మంత్రి శ్రీహరి అన్నారు. బడ్జెట్ కోసం తాను ప్రభుత్వ పెద్దలతోనే గట్టిగానే మాట్లాడి రూ.122 కోట్లను కేటాయించే విధంగా చూసినట్టు తెలిపారు.
ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో సభకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీలు ఈటల రాజేందర్, మల్లు రవి హాజరయ్యారు. ఎంపీ ఈటల మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో మత్స్యకారులకు పెద్దపీట వేసి ఉచితంగా చేప పిల్లలు అందించారని గుర్తుచేశారు. చేపల విక్రయానికి ఆటోలు, మోటర్ సైకిళ్లు, ఐస్ బాక్స్ వంటి ఎన్నో పథకాలను అందించినట్టు తెలిపారు.