‘కేసీఆర్ ఆనవాళ్లను లేకుండ చేస్తం’ అని ప్రకటించిన కాంగ్రెస్ నాయకులు ఇదిగో ఇక్కడ బీఆర్ఎస్ వాల్ రైటింగ్లను చెరిపే పనిలో పడ్డరు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలిరావాలన్న పిలుపుతో బీఆర్ఎస్ ఊరూరా వాల్రైటింగ్ చేయిస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ సమీపంలో హైవే పక్కన కల్వర్టుకు బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్ రైటింగ్ను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేరిట రాయించగా కాంగ్రెస్ నాయకులు దానిపై వైట్ పెయింట్ వేయించారు.
పైగా ఉచిత బస్సు పథకం ప్రచార రాతలు రాసి తమ అక్కసు వెళ్లగక్కారు. అటుగా వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర దాన్ని చూసి కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. తమ సహనాన్ని పరీక్షించొద్దని ఆగ్రహం వ్యక్తంచేశారు. – జయశంకర్ భూపాలపల్లి