హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ తరఫున ఎన్నికల్లో గెలుపొందిన కొద్దిరోజులకే కాంగ్రెస్ పార్టీలో చేరిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తిచేయాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును కోరింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై స్పీకర్ చర్య లు తీసుకునేలా ఉత్తర్వులు జారీచేయడం వల్ల ఇతర ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల బాటలోకి వెళ్లకుండా ఉంటారని సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు చెప్పారు.
ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రె డ్డి, కేపీ వివేకానంద వేర్వేరుగా వ్యాజ్యాల ను దాఖలుచేశారు. వీటిపై సోమవారం జస్టి స్ బీ విజయ్‌సేన్‌రెడ్డి మరోసారి విచారణ చే పట్టారు. ఫిరాయింపుల వ్యవహారంపై స్పీక ర్ తుది నిర్ణయం తీసుకునే వరకు కోర్టు ల జోక్యానికి ఆసారం లేదని 1992లో సు ప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల విస్తృ త ధర్మాసనం తీర్పు చెప్పిందని, కాబట్టి ఈ వ్యాజ్యాల్లో ఉత్తర్వుల జారీ చేయనకర్లేదని అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదించారు. అనంతరం తదుపరి విచారణను కోర్టు ఈ నెల 11కు వాయిదా పడింది.
ఏడు నెలలైనా ఎన్నికల బిల్లులు రాలే
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాశ్ కుమార్‌కు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాం ట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఎన్నికల్లో ఈవీఎంల తరలింపు, పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు, సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు, డీఆర్సీ సెంటర్లలో ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేయడానికి టెండర్లను పిలిచారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సంబంధించి 20 కోట్ల బిల్లులు రావాలని కాంట్రాక్టర్ సుంకరి సత్తయ్య తెలిపారు.
టూరిజం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): టూరిజం కార్పొరేషన్ పరిధిలోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నేతలు కోరారు. ప్రధానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన పటేల్ రమేశ్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజమౌళి, జ్యోతి, రచన, గోపి, రమేశ్, చంద్రమౌళి, ఇక్బాల్ పాల్గొన్నారు.