హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై ఆధారాలు లేని ఓ తప్పుడు కేసు పెట్టి.. సీఎం ఆదేశాల మేరకు పోలీసులు ఇష్టారీతిన వేధిస్తున్నారని బీఆర్ఎస్ లీగల్ టీమ్ ఆరోపించింది. ఓ తప్పుడు కేసులో క్రిశాంక్‌ను బలవంతంగా ఇరికించేందుకు తప్పు మీద తప్పులు చేస్తూనే ఉన్నారని మం డిపడింది. ఈ నెల 1న క్రిశాంక్‌ను బలవంతంగా అరెస్టు చేసింది మొదలు.. 9వ తేదీ రాత్రి వరకూ కోర్టుల ముందు హాజరుపర్చేందుకు తిప్పుతూనే ఉన్నారని మండిపడింది. ఈ మేరకు గురువారం బీఆర్ఎస్ లీగల్ టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘సోషల్ మీడియాలో ఒక నోటీసు ప్రచారం చేయబడుతున్నది. అది విశ్వవిద్యాలయం ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నది’ అంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడని, అందులో ఎక్కడా క్రిశాంక్‌ను పేర్కొనలేదని తెలిపింది.
అయినప్పటికీ పోలీసులు ఎలాంటి ముందస్తు నోటీసు లేకుం డా మన్నె క్రిశాంక్‌ను అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. ఆ రోజు అర్ధరాత్రి వరకు క్రిశాంక్‌ను పలు పోలీస్స్టేషన్లకు తిప్పారని తెలిపారు.ఎందుకు అరెస్టు చేశారో, ఎక్కడ ఉంచా రో చెప్పాలని కుటుంబసభ్యులు బతిమాలినా పోలీసులు వెల్లడించలేదని పేర్కొన్నారు. ఓయూ పోలీస్‌స్టేషన్‌లో ఆరా తీస్తే.. కేసు డైరీ కాపీని అందించారని, మాట్లాడేందుకు ప్రయత్నిస్తే అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లకుంట పోలీస్‌స్టేషన్ నుంచి గాంధీ దవాఖానకు, అక్కడి నుంచి లాలాగూడ పీఎస్‌కు తీసుకెళ్లారని చెప్పారు. ఆ రోజు రాత్రి 11.30 గంటలకు ఈస్ట్ మారేడ్‌పల్లిలోని 4వ ఏసీఎంఎం న్యాయమూర్తి ముందు హాజరుపర్చారని తెలిపారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈ రకం కేసుల్లో నిందితులకు ముందుగా 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీచేయాలని బీఆర్ఎస్ లీగల్ టీమ్ పేర్కొన్నది. ఇందుకు తెలంగాణ హైకోర్టు సర్క్యూలర్ జారీ చేసిందని గుర్తు చేసింది.ఒకవేళ నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేసి, కోర్టుముందు హాజరుపరిస్తే మరుసటి రోజు పూచీకత్తుతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని తెలిపింది. అయితే మన్నె క్రిశాంక్లో ఆ నిబంధనలు పాటించకపోగా, సుప్రీంకోర్టు తీర్పులను విస్మరిస్తూ..బెయిల్ మంజూ రు కాకుండా పోలీసులు తిప్పుతున్నారని తెలిపింది. క్రిశాంక్‌ను ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతోనే 9 రోజులుగా కోర్టుముందు తిప్పుతున్నారని పేర్కొం ది. ఎన్నికలు పూర్తయ్యే వరకూ క్రిశాంక్‌ను జైల్లోనే ఉంచాలనే కుట్రతో కాంగ్రెస్‌పార్టీ కుయుక్తులు పన్నుతున్నదని బీఆర్ఎస్ లీగల్ టీమ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.