దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి
దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా కల్పించాలనే డిమాండ్‌పై బీఆర్ఎస్ తన పోరాటాన్ని ముమ్మరం చేసింది. ఈ అంశంపై అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ కే బాలకృష్ణన్ కమిషన్‌తో భేటీ అయ్యేందుకు నలుగురు సభ్యుల (బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ మంత్రి, కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్)తో కూడిన ప్రతినిధుల బృందం మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నది.
- మతం మారినంత మాత్రాన సామాజిక వెనుకబాటుతనం పోదు
- నేడు ఢిల్లీకి వెళ్లనున్న బీఆర్ఎస్ నలుగురు ప్రతినిధుల బృందం
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా కల్పించాలనే డిమాండ్‌పై బీఆర్ఎస్ తన పోరాటాన్ని ముమ్మరం చేసింది. ఈ అంశంపై అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ కే బాలకృష్ణన్ కమిషన్‌తో భేటీ అయ్యేందుకు నలుగురు సభ్యుల (బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ మంత్రి, కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్)తో కూడిన ప్రతినిధుల బృందం మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నది. దళిత క్రైస్తవుల సామాజిక స్థితిగతులు, వారికి జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ కమిషన్‌కు ఈ బృందం సమగ్ర నివేదిక సమర్పించనున్నది.
కేవలం మతం మారినంత మాత్రాన ఆర్థిక, సామాజిక పరిస్థితి మారిపోదని పార్టీ ప్రతినిధులు పేరొన్నారు. దళిత క్రైస్తవులు ఎదురొంటున్న అతిపెద్ద చట్టపరమైన సమస్య 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులు. క్రైస్తవ మతంలోకి మారిన కారణంగా ఈ ఉత్తర్వుల ప్రకారం వారు షెడ్యూల్డ్ కులాలకు దకాల్సిన రాజ్యాంగ హకులు, రిజర్వేషన్ల ప్రయోజనాలను పూర్తిగా కోల్పోతున్నారు. ఈ ఉత్తర్వులను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాల్సిందిగా బాలకృష్ణన్ కమిషన్‌కు బీఆర్ఎస్ బృందం విజ్ఞప్తి చేయనున్నది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు దళిత క్రైస్తవుల హకుల కోసం మొదటి నుంచి కట్టుబడి ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేతలు గుర్తుచేశారు.దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గతంలోనే తెలంగాణ శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించిన విషయాన్ని, ఆ తీర్మాన ప్రతులను కమిషన్ ముందు పెట్టనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

