హైదరాబాద్ : నాగార్జునసాగర్ ఉదంతం మరువకముందే నల్లగొండలో మరో ఘోరం చోటు చేసుకుంది. నల్లగొండ మున్సిపాలిటీలోని(Nallgonda Municipality) 11 వార్డు పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో (Water tank) అనుమానాప్పద స్థితిలో మృతదేహం(Dead body )లభించడం స్థానికంగా కలకలం రేపింది. వాటర్ ట్యాంకులో వాటర్ చెక్ చేయగా అందులో డెడ్ బాడీ ప్రత్యక్షమైంది. వెంటనే మున్సిపాలిటీ సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీశారు.
డెడ్‌బాడీ హనుమాన్ నగర్‌కు చెందిన ఆవుల వంశీగా గుర్తించారు. అతడు పది రోజుల క్రితం నుంచి కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదైయింది. అయితే అతడు ఆత్మహత్య చేసుకున్నా డా? లేక ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడా అనే విషయం తెలియాల్సి ఉంది. కాగా, ఇదే నీళ్లను గత పది రోజులుగా మున్సిపాలిటీ ప్రజలు తాగుతున్నారు. కలుషిత నీటిని 10 రోజుల నుంచి వాడామని తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, కొద్ది రోజుల క్రితం నాగార్జునసాగర్‌లో ఎండల తాకిడితో.. దాహం తీర్చుకోవడానికి ఒకదాని వెంట ఒకటి మినీ ట్యాంకులోకి దిగిన కోతులు అందులోనే ప్రాణాలొదిలిన వైనం బయటపడిన విషయం తెలిసిందే.