అచ్చంపేట, మార్చి 21 : నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో ఏడుగురి మృతదేహాల ఆచూకీ నేటికీ లభ్యం కాలేదు. 28 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. కలెక్టర్ సంతోష్ ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు.
ప్రధానంగా టన్నెల్ చిక్కుకుపోయిన బోరింగ్ మెషిన్లోని కీలక భాగాలను కత్తిరించి తొలగించడం.. సొరంగంలోకి చేరిన నీటిని బయటకు తరలిస్తున్నారు.