హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల రెండో జాబితాను బహుజన్ సమాజ్‌పార్టీ (బీఎస్పీ) సోమవారం విడుదల చేసింది. 39 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. 20 మందితో తొలిజాబితాను విడుదల చేయగా, తాజాగా మరో 39 మంది అభ్యర్థులను ప్రకటించింది.
ఇంకా 60 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉన్నది. కోరుట్ల నుంచి పూదరి నిశాంత్ కార్తికేయ, రాజేంద్రనగర్ నుంచి ప్రొఫెసర్ అన్వర్‌ఖాన్, మునుగోడు నుంచి శంకరాచారిలకు టికెట్లు కేటాయించారు.