విషాదం : ఉయ్యాలే ఉరితాడై..చిన్నారి ఊపిరి తీసింది
రాజన్న సిరిసిల్ల : ఉయ్యాలే ఆ చిన్నారి పాలిట ఉరితాడైంది. పాప సరదాగా ఆడుకుంటుందని తల్లిదండ్రులు కట్టిన ఉయ్యాల వారి కుటుంబానికి తీరని వేదనను మిగిల్చింది. ఊయ్యాలే ఆ చిన్నారి పాలిట మృత్యు పాశమై ఊపిరి తీసింది. ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన దిలీప్ దంపతులకు ఏడాది వయసు గల పాప ఉంది. పాప ఇంట్లో ఆడుకుంటుందని తల్లిదండ్రులు ఉయ్యాల కట్టారు. అదికాస్తా పాప మెడకు బిగియడంతో ఊపిరాడక మరణించింది.
పక్క గదిలో ఉన్న కుటుంబ సభ్యులు గుర్తించే సరికే అప్పటికే నష్టం జరిగిపోయింది. చిన్నారిని వైద్యం కోసం హాస్పిటల్కు తీసుకెళ్లగా.. పాప మరణించిందని వైద్యులు ధృవీకరించారు. అప్పటి వరకు సరదాగా ఆడుకుంటున్న పాప అంతలోనే మృత్యు ఒడిలోకి చేరడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

