హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 3న ‘అసెంబ్లీ ముట్టడి’కి ఆటో డ్రైవర్ల జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్లోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆటో సంఘాల నాయకులు సమావేశమయ్యారు. అనంతరం జేఏసీ అధ్యక్షుడు వేముల మారయ్య మాట్లాడుతూ.. ఆటో కార్మికులను రేవంత్ సరార్ మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమయ్యాయని నిప్పులు చెరిగారు. ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12వేలు ఇస్తామని కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: మధుసూదనాచారి
ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజాన కేంద్రం లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లు పిలుపునిచ్చిన ‘చలో అసెంబ్లీ’కి బీఆర్ఎస్ సంఘీభావం ఉంటుందని హామీనిచ్చారు.