మానకొండూర్, మే 21: రాజకీయ కక్షతోనే కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌లోని ధవళేశ్వరం ప్రాజెక్టుకు తరలించడానికి కుట్ర జరుగుతున్నదని, అందుకే పథకం ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం దాడిచేస్తున్నదని విమర్శించారు. బుధవారం ఆయన మానకొండూర్‌లోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మెప్పు కోసం రేవంత్‌రెడ్డి తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. నీటితో కళకళలాడాల్సిన కాళేశ్వరాన్ని ఎండబెట్టి ఇసుకను తోడేస్తున్నారని ధ్వజమెత్తారు.
హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్‌కు కీర్తి రావడాన్ని జీర్ణించుకోలేకనే ఆయనను బద్నాం చేసే కుట్రలకు ప్రభుత్వం పాల్పడుతున్నదని తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ విమర్శించారు. అందులో భాగమే కాళేశ్వరం కమిషన్ నోటీసులు అని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కక్ష సాధింపులకు మానవరూపం రేవంత్‌రెడ్డి అని మండిపడ్డారు. ఎన్ని నోటీసులిచ్చి ఎంత బద్నాం చేద్దామనుకున్నా తెలంగాణ ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన కేసీఆర్‌ను దూరంచేయడం ఎవరికీ సాధ్యం కాదని చెప్పారు.
హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం విచారణ పేరిట కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడం రాజకీయ ప్రతీకార ధోరణికి నిదర్శనమని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి కసర్ల పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం కృషిచేసిన నాయకులను లక్ష్యంగా చేసుకుని, వారి ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నాలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు.