HomeTelanganaThe Area Of Paddy Fields Across The Country Is Increasing Every Year
Alluvial soils | సాగు రంగానికి పెను ప్రమాదం.. దేశవ్యాప్తంగా ఏటా పెరుగుతున్న చౌడు నేలల విస్తీ ర్ణం
Alluvial soils | దేశవ్యాప్తంగా చౌడు నేలల విస్తీ ర్ణం ఏటా పెరుగుతున్నది. సాగులో వైవిధ్యం లేకపోవడం, భూగర్భ జలాలను అధికంగా వినియోగించడంతో సల్ఫేట్ లాంటి లవణా లు నేల ఉపరితలంపైకి చేరడం ఇందుకు కారణమని నేషనల్ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, ఇక్రిశాట్ అధ్యయనంలో తేలింది.
ఉత్తరాదిలో సమస్య తీవ్రం
అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, ఇక్రిశాట్ అధ్యయనంలో వెల్లడి
Alluvial soils | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా చౌడు నేలల విస్తీ ర్ణం ఏటా పెరుగుతున్నది. సాగులో వైవిధ్యం లేకపోవడం, భూగర్భ జలాలను అధికంగా వినియోగించడంతో సల్ఫేట్ లాంటి లవణా లు నేల ఉపరితలంపైకి చేరడం ఇందుకు కారణమని నేషనల్ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, ఇక్రిశాట్ అధ్యయనంలో తేలింది. నేలలో లవణీయత పెరగడంతో పర్యావరణ మార్పులు సంభవించడంతోపాటు సాగు ప్రభావితమై ఆహార కొరతకు దారితీయవచ్చని పేర్కొన్నది.
15 రాష్ర్టాల్లో అధ్యయనం
దేశవ్యాప్తంగా చౌడు నేలల విస్తీర్ణాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ నిపుణులు 15 రాష్ర్టాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో ఈ అధ్యయనం నిర్వహించారు. ఐదేండ్లలో 13.69 లక్షల హెక్టార్ల భూముల్లో లవణీయత పెరిగినట్టు నిర్ధారించారు. గుజరాత్, యూపీ, పశ్చిమ బెంగాల్ లాంటి ఉత్తరాది రాష్ర్టాల్లో చౌడు అధికంగా ఉన్నట్టు తేల్చారు. తీర ప్రాంతం ఎక్కువగా ఉండే గుజరాత్లో ఏకంగా 22.22 లక్షల, మహారాష్ట్రలో 6.07 లక్షల, పశ్చిమ బెంగాల్ 4.41 లక్షల హెక్టార్ల చౌడు ఉన్నట్టు గుర్తించారు.
లవణీయతను ఇలా గుర్తించవచ్చు..
లవణ సూచిక 1.5 కంటే ఎకువగా ఉ న్న నేలలను చౌడు భూములుగా నిర్ధారించవచ్చు. వేసవి కాలంలో ఆ నేలల పైభాగాన ఉప్పు పేరుకుంటుంది. ఆ లవణాలు గాలిలోని తేమను పీల్చుకోవడంతో నేల ఎప్పుడూ తడిగా ఉండి, కాలు వేసినప్పుడు కుంగిపోతుంది. అంతేకాకుండా ఆ ప్రాంతాల్లోని మొక్కల్లో ఎదుగుదల లోపించడంతోపాటు ఆకులు ముడుచుకుపోవడం, వాటి చివర్లు ఎండిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.