రామన్నపేట, డిసెంబర్27: డ్రైపోర్టు పేరుతో అదానీ గ్రూప్ తీసుకున్న భూముల్లో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పనులను ప్రారంభిస్తే సహించేదిలేదని పర్యావరణ పరిరక్షణ వేదిక కన్వీనర్ జెల్లెల పెంటయ్య, కో కన్వీనర్ ఎండీ రేహాన్ స్పష్టంచేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేటలో అంబుజా సిమెం ట్ పరిశ్రమ ప్రతిపాదిత స్థలంలో శుక్రవారం భారీ యంత్రాలతో పనులను చేపట్టేందుకు ప్రయత్నిస్తున్న సిబ్బందిని స్థానికులు, పర్యావరణ పరిరక్షణ వేదిక నాయకులు అడ్డకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణలో పూర్తిస్థాయిలో వ్యతిరేకించి రెండు నెలలు దాటినా నేటివరకు ఎలాంటి ప్రకటన చేయకుండా గట్టుచప్పుడు కాకుండా భారీ యంత్రాలతో పనులు ప్రారంభించాలని చూస్తున్నారని మండిపడ్డారు. లాజిస్టిక్ పార్కు ముసుగులో సిమెంట్ పరిశ్రమ పనులు ప్రారంభిస్తే ప్రజలు తిరుగబడుతారని హెచ్చరించారు.