హైదరాబాద్, డిసెంబర్9 (నమస్తే తెలంగాణ): రిజర్వేషన్ల నిర్వీర్యానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని అఖిల భారత ఓబీసీ విద్యార్థుల సంఘం నేతలు ఆరోపించారు. సోమవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ..
ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్ర విశ్వవిద్యాలయాలతోపాటు ఇతర విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల ఉల్లంఘనకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. రాజ్యసభ సభ్యుడు విల్సన్, ఏఐవోబీసీఎస్ఏ జాతీయ అధ్యక్షుడు కిరణ్కుమార్, సలహాదారు ఆళ్ల రామకృష్ణ, డాక్టర్ పరశురాములు తదితరులు పాల్గొన్నారు.