హైదరాబాద్, అక్టోంబర్ 1 (నమస్తే తెలంగాణ): 2024 రుతుపవనాల సీజన్ సాధారణం కన్నా 7.6 శాతం అధిక వర్షపాతంతో ముగిసిందని ఐఎండీ మంగళవారం తెలిపింది. ఈ సీజన్లో రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అధిక వర్షపాతం నమోదైందని పేర్కొన్నది.
నైరుతి రుతుపవనాల సీజన్ అధికారికంగా సెప్టెంబర్ 30న ముగిసిందని తెలిపింది. దేశంలో 934.8 మిమీ వర్షపాతం నమోదైందని, దీర్ఘకాలిక సగటులో 2 020 తర్వాత 108% అత్యధికంగా నమోదైంది.