హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : కక్షపూరిత రాజకీయాలు రాష్ట్ర పురోగతిపై ప్రత్యేకించి రాష్ర్టానికి వచ్చే పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపుతాయని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కక్ష రాజకీయాలు మంచిది కాదని హితవు పలికారు. ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంపై తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.. ‘కక్షపూరితమైన చర్యల వల్ల రాష్ర్టానికి రావాల్సిన పెట్టుబడులపై ప్రభావం పడుతుంది’ అన్నారు. అలాంటి చర్యలతో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే విషయంలో పారిశ్రామికవేత్తలు సంశయిస్తారని అన్నా రు. ఈ నేపథ్యంలో కక్ష రాజకీయాలు కాకుండా చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వాలు చేయాల్సిన ముఖ్యమైన పని అదేనని అభిప్రాయపడ్డారు.