అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇంకా 3 రోజులే. మహిళా సంక్షేమం, భద్రత, సాధికారత విషయంలో తెలంగాణ ముందువరుసలో ఉన్నది. అది ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే అని ఆనందంగా చెప్తున్నా. మహిళల విషయంలో తీసుకొన్న గొప్ప అడుగు.. కేసీఆర్ కిట్స్.
ప్రపంచంలోనే ఉత్తమం
ప్రపంచంలోనే ఒక ఉత్తమమైన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం కేసీఆర్ కిట్ అని గర్వంగా చెప్తున్నా. రాష్ట్రంలో ఈ పథకం ద్వారా ఇప్పటికే 13,30,000 మంది లబ్ధి పొందారు. ఇది తెలంగాణ విజయం.
తల్లీబిడ్డ సంరక్షణే ధ్యేయం
కేసీఆర్ కిట్లో.. తల్లీబిడ్డకు అవసరమైన 16 వస్తువులు ఉన్నాయి. ఆడబిడ్డ పుడితే ఆర్థిక సహాయంగా రూ.13వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు కూడా అందజేస్తు న్నాం. డెలివరీ తర్వాత అమ్మ ఒడి వాహనాల ద్వారా తల్లీబిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చుతున్నాం. 300కు పైగా వాహనాలను అందుబాటులోకి తెచ్చాం.
థ్యాంక్స్ టూ కేసీఆర్ కిట్స్
దవాఖానల డెలివరీలు 22 శాతం పెరిగాయి. 2014లో 30 శాతం ఉండగా, 2021 నాటికి 52 శాతానికి పెరిగాయి.
ప్రసూతి మరణాల రేటు(ఎంఎంఆర్) 92 నుంచి 63కు తగ్గింది. అదే సమయంలో జాతీయ సగటు 113గా ఉన్నది.
శిశు మరణాల రేటు 39 నుంచి 23కు తగ్గింది. అదే సమయంలో జాతీయ సగటు 42గా ఉన్నది.
-వేర్వేరు ట్వీట్లలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్