హైదరాబాద్ : ప్రవళిక(Pravalika) ఆత్మహత్య విషయంలో సీఎం కేసీఆర్(CM KCR), మంత్రి కేటీఆర్ మానవవీయంగా స్పందించారని యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వంశీమోహన్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రవళిక ఆత్మహత్య తీవ్రంగా కలచివేసింది. ఇలాంటి సమయంలో ఆమె కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దీన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గొప్ప మానవతా ధృక్పథంతో ఆలోచించారని చెప్పారు.
ప్రవళిక కుటుంబసభ్యులను పిలిపించుకొని ధైర్యం చెప్పినందుకు మంత్రి కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదా తెలిపారు. ఆర్థికంగా ఆదుకుంటామన్న హామీ ఇచ్చి ఆ కుటుంబానికి కొండంత భరోసా కల్పించారన్నారు. ప్రవళిక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని, ఆమె ఆత్మహత్యకు కారణమైన బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.
ప్రవళిక కుటుంబం ఆపదలో ఉంటే అండగా ఉండాల్సింది పోయి, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని చూడటం కొన్ని రాజకీయ పార్టీల కుటిల బుద్ధికి నిదర్శనమని విమర్శించారు. చిల్లర రాజకీయాలు మానకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.