TGSRTC Bus : ఇటీవల ప్రైవేట్ ట్రావెస్ బస్సులు, ఆర్టీసీ బస్సులు వరుసగా ప్రమాదాలకు గురవ్వడం ప్రయాణికుల్లో వణుకు పుట్టిస్తోంది. చేవెళ్ల బస్సు ప్రమాదాన్ని మరవకముందే మరొక ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులకు తృటిలో ప్రమాదం తప్పింది. మంచిర్యాలకు కోరుట్ల డిపోకు చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు మొదలయ్యాయి. దాంతో.. ఆ సమయంలో బస్సులో ఉన్న 70 మంది భయభ్రాంతులకు లోనయ్యారు.
కోరుట్ల బస్సు హజీపూర్ మండలం గుడిపేట వద్దకు చేరుకోగానే అందులో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్, కండక్టర్ ప్రయాణికులను అలర్ట్ చేశారు. చివరకు అందులోని 70మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలిసిన ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల కోసం మరో బస్సు సఏర్పాటు చేశారు.