హైదరాబాద్, నవంబర్ 26(నమస్తే తెలంగాణ): ‘కార్తిక వనభోజనాలతో కార్మికులకు ఒరిగేదెంటి? ఒక్కరోజు భో జనం పెట్టి ఏడాదంతా సంతోషంగా ఉండమంటారా? యూనియన్ల స్థానం లో ఏర్పాటు చేసిన వెల్ఫేర్ బోర్డుల ద్వా రా సాధించిందేంటి? కనీసం ఒక్క సమస్యకైనా పరిష్కారం చూపారా? ఇంకెం త కాలం ఇలా మభ్యపెడుతారు..’ అం టూ టీజీఎస్ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రశ్నల వర్షం కురిపించారు. మంగళవారం జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి, కన్వీనర్ మౌ లానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, యాదగిరి ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ యాజమాన్యం రో జురోజుకూ కార్మికులపై పనిభారం పెం చి శ్రమదోపిడీ చేస్తున్నదని మండిపడ్డా రు. ఇప్పటికైనా కార్మికులపై పని ఒత్తిడి తగ్గించాలని, పనికి తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే కలిసివచ్చే వారితో కలిసి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
నిబంధనలు పాటించిన వారికే ‘రెరా’ అనుమతి
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): కొత్తగా ఇండ్లు నిర్మించి విక్రయించే రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ ప్రాజెక్టును రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) వద్ద రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో అడ్డదారులు తొక్కుతున్నారు. సరైన పత్రాలు లేకుండా అమ్మకాలు జరుపుతుండడంతో మోసానికి గురవుతున్న కొనుగోలుదారులు ఇటీవలి కాలంలో భారీ సంఖ్యలో రెరాకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెరా చైర్మన్ ఎన్ సత్యనారాయణ, వైస్ చైర్మన్లు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, సెక్రటరీ తదితర అధికారులు మంగళవారం ఓ సమావేశం నిర్వహించారు. తమ వద్ద ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ కోసం చేసిన దరఖాస్తులలో సరైన పత్రాలు లే వని వారు డిఫాల్టర్ దరఖాస్తుదారులకు తెలిపారు. గడువులోపు అవసరమైన పత్రాలు అందించకపోతే, వారికి అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అనుమతి ఇవ్వకపోయినా కొందరు త మ అనుమతి ఉన్నట్టు బ్రోచర్లలో, ప్రీ లాంచ్ కార్యక్రమాల్లో ప్రచారం చేసుకుంటున్నారని, వారిపై చర్యలు తప్పవని రెరా అధికారులు హెచ్చరించారు.