ఆర్టీసీ కనుమరుగుకు రేవంత్ కుట్రలు
టీజీఎస్ ఆర్టీసీని కనుమరుగు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్లో అన్ని శాఖలకు నిధులు ఇచ్చినా ఆర్టీసీకి మాత్రం కేటాయించలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
- మంత్రి పొన్నం రాజీనామా చేయాలి
- ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి
- కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
కరీంనగర్ తెలంగాణచౌక్/ హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : టీజీఎస్ ఆర్టీసీని కనుమరుగు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్లో అన్ని శాఖలకు నిధులు ఇచ్చినా ఆర్టీసీకి మాత్రం కేటాయించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్టీసీకి నిధులు కేటాయిండంలో విఫలమైన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు.. ‘ఆర్టీసీ డిపోల్లో ఎల్ట్రకిక్ బస్సులు ఉండొద్దు.. ఆర్టీసీ స్థలాల్లో ఆర్టీసీ బస్సులే ఉండాలే.. మా భూములు మాకే కావాలే’ అనే డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ఆర్టీసీ డిపోల్లో కార్మికులు నిరసన చేపట్టారు.
కరీంనగర్ డిపో -2 ఎదుట కార్మికులు చేపట్టిన అర్ధనగ్న ప్రదర్శనలో థామస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని, యూనియన్‌కు అనుమతి ఇస్తామని రేవంత్‌రెడ్డి వాగ్దానాలు చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. కేంద్రం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాలన్నీ అమలు చేయడానికి రేవంత్‌రెడ్డి మధ్యవర్తిత్వం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కేంద్ర నిధులతో ఎలక్ట్రా, జేబీఎం కంపెనీల ఈవీ బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగించారని పేర్కొన్నారు. ఈ బస్సులను నడిపించి లాభాలు ఆ సంస్థలకు అప్పగించడం ద్వారా ఆర్టీసీ తీవ్రంగా నష్టపోతున్నదని వాపోయారు. ఈవీ బస్సులను ఆర్టీసీ యాజమాన్యానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీకి బకాయి రూ.7,500 కోట్లు ఉంటే రాష్ట్ర బడ్జెట్లో కేవలం రూ.4వేల కోట్లే కేటాయించారని చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ రీజినల్ చైర్మన్ ఎంపీ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

