హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) నియామకాలకు సంబంధించి అభ్యర్థులు దరఖాస్తులను త్వరగా సమర్పించాలని పోలీసు నియామక మండలి (టీజీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు సూచించారు.
చివరిరోజు వరకు వేచిచూడకుండా తక్షణం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.