Group-2 | హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్-2 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు తుది ఫలితాల జీఆర్‌ఎల్‌ను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. మొత్తం 18 రకాల పోస్టులకు సంబంధించి.. ఎంపికైన వారి జాబితాను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. 783 పోస్టులకు గానూ 782 పోస్టులకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించింది టీజీపీఎస్సీ. ఒక వెకెన్సీని విత్ హెల్డ్‌లో పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
గ్రూప్-2 నోటిఫికేషన్‌ను 2022లో విడుదల చేయగా, 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో రాతపరీక్షలను నిర్వహించారు. దాదాపు 2,49,964 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే.. ఓఎంఆర్ పత్రాల్లో లోపాలు, బబ్లింగ్ సరిగా చేయకపోవడం వంటి కారణాలతో 13,315 మందిని కమిషన్ అనర్హులుగా ప్రకటించింది. మిగిలిన 2,36,649 మంది అభ్యర్థులకు సంబంధించిన మార్కులు, జనరల్ ర్యాంక్ లిస్ట్‌ను ఈ ఏడాది మార్చి 11న టీజీపీఎస్సీ విడుదల చేసింది.