అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి పెంచాలి
టీజీపీఎస్సీ నియామక అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి పెంచాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడి ్డసుధీర్రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ కోరారు.
- ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, వివేకానంద్ డిమాండ్
- టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశంకు వినతి
ఎల్బీనగర్, జూన్ 12: టీజీపీఎస్సీ నియామక అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి పెంచాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడి ్డసుధీర్రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ కోరారు. శుక్రవారం టీజీపీఎస్సీ నియామక అభ్యర్థుల వయో పరిమితిని పెంచాలని కోరుతూ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశంకు ఎమ్మెల్యేలు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీజీపీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితిని ప్రస్తుతం ఉన్న 44 ఏండ్ల నుంచి 46 ఏండ్లకు పెంచాలని కోరారు. గతంలో అమల్లో ఉన్న జీవో నంబర్ 42 ప్రకారం అభ్యర్థుల వయో పరిమితి 46 ఉండేదని, అనంతరం జారీ చేసిన జీవో 86 ద్వారా 44 ఏండ్లకు పరిమితం చేయడం ద్వారా అనేక మంది అర్హులైన అభ్యర్థులు అవకాశాలు కోల్పోతున్నారని తెలిపారు.
అనేక శాఖల్లో చాలా ఏండ్ల తర్వాత నియామక నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయని, ముఖ్యంగా డీఈవో, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల వంటి పోస్టులకు సుదీర్ఘ విరామం తర్వాత నోటిఫికేషన్లు వెలువడుతున్నాయని, క్రమబద్ధమైన వార్షిక నియామక క్యాలెండర్ లేకపోవడంతో పీజీ, పీహెచ్డీ అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. దరఖాస్తు ఫీజును ప్రస్తుతం ఉన్న రూ. వెయ్యి నుంచి రూ. వందకు తగ్గించాలని కోరారు. టీజీపీఎస్సీ అధికారులు ఈ అంశాలు పరిశీలించి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో గడ్డిఅన్నారం మాజీ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్‌కుమార్, వనస్థలిపురం కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్‌రెడ్డి, నిరుద్యోగ జేఏసీ నాయకుడు ఇంద్రానాయక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

