Group-2 | హైదరాబాద్ : గ్రూప్-2 అభ్యర్థులకు టీజీపీఎస్సీ మరో అవకాశం కల్పించింది. తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ టీజీపీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇక భవిష్యత్‌లో ఎడిట్ ఆప్షన్‌కు అవకాశం ఉండదని, ఇదే చివరి అవకాశమని, ఎవరైనా అభ్యర్థులు తప్పిదాలు చేస్తే సరి చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల ఎడిట్ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా తమ దరఖాస్తును పీడీఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.