TGPSC | గ్రూప్-1 పిటిషన్లపై హైకోర్టులో సవాల్ చేసిన టీజీపీఎస్సీ.. రేపు విచారించనున్న సీజే ధర్మాసనం..!
TGPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పరీక్షల పిటిషన్పై హైకోర్టులో అప్పీల్ చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేసింది. పిటిషన్పై మంగళవారం హైకోర్టు సీజే ధర్మాసనం విచారించే అవకాశం ఉన్నది.
TGPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పరీక్షల పిటిషన్పై హైకోర్టులో అప్పీల్ చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేసింది. పిటిషన్పై మంగళవారం హైకోర్టు సీజే ధర్మాసనం విచారించే అవకాశం ఉన్నది. గ్రూప్-1లో అక్రమాలు జరిగాయని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం సరిగ్గా జరగలేదని పిటిషనర్లు ఆరోపించారు. గ్రూప్-1 మెయిన్స్లో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సింగిల్ బెంచ్ విచారణ జరిపింది. విచారణ పూర్తయి తుది తీర్పు వెలువడే వరకు నియామక పత్రాలు జారీ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను కొనసాగించొచ్చని చెప్పింది.
రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి టీజీపీఎస్సీ జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. జులై 7న ఫలితాలు విడుదల చేసింది. అనంతరం మెయిన్స్ పరీక్షలను పరీక్షలు చేపట్టింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు టీఎస్పీఎస్సీ మెయిన్స్ నిర్వహించింది. పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ప్రకటించి.. సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టింది. మూల్యాంకనం విషయంలో పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో సింగిల్ బెంచ్ జడ్జి గత వారం నియామకాలు చేపట్టొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా సింగిల్ బెంచ్ ఆదేశాలను టీజీపీఎస్పీ సవాల్ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

