హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 పోస్టుల భర్తీలో భాగంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. 16, 17, 19, 21 తేదీల్లో షార్ట్ లిస్టు చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. 563 పోస్టులను భర్తీచేస్తుండగా, ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యే వారి జాబితాను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచామని పేర్కొన్నారు.
గురువారం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ డాక్యుమెంట్లు, రెండు సెట్ల జిరాక్స్ ప్రతులను వెంట తెచ్చుకోవాలని సూచించారు. అందుబాటులో లేని వారి కోసం ఈ నెల 22న రిజర్వుడే ఉంటుందని తెలిపారు. ఈ నెల 15 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చని పేర్కొన్నారు.