హైదరాబాద్, జనవరి 2(నమస్తే తెలంగాణ) : తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీఎల్ఏ) లోగోను మాజీ మంత్రి హరీశ్‌రావు బుధవారం ఆవిష్కరించారు. ఇటీవలే ఎన్నికైన రాష్ట్ర నూతన కార్యవర్గం సిద్దిపేటలో హరీశ్‌రావుతో భేటీ అయ్యింది. టీజీఎల్ఏ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా సీహెచ్ కనకచంద్రం, ప్రధానకార్యదర్శిగా శేఖర్, అసోసియేట్ అధ్యక్షుడిగా కొండల్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నరసింహ, ఉపాధ్యక్షుడిగా కే శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సిద్ధారెడ్డి, ప్రచార కార్యదర్శిగా నాగేందర్, అధికార ప్రతినిధిగా ఎన్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా పవన్ ఎన్నికకాగా, హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు.