వైటీపీఎస్‌లో యూనిట్-3 సీవోడీ సక్సెస్.. 72 గంటల్లో 58.525 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) మరో మైలురాయిని అధిగమించింది. ఈ ప్లాంట్‌లోని యూనిట్-3లో ఈ నెల 10 నుంచి నిర్వహించిన కమర్షియల్ ఆపరేషన్ డేట్ (సీవోడీ) బుధవారం విజయవంతంగా ముగిసింది. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ యూనిట్‌ను 72 గంటలపాటు నిర్విరామంగా నడిపారు.
- 3,200 మెగావాట్లకు చేరుకున్న కరెంట్ ఉత్పత్తి
- కేసీఆర్ సంకల్పం సాక్షాత్కారం
హైదరాబాద్/దామరచర్ల, మే 13 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) మరో మైలురాయిని అధిగమించింది. ఈ ప్లాంట్‌లోని యూనిట్-3లో ఈ నెల 10 నుంచి నిర్వహించిన కమర్షియల్ ఆపరేషన్ డేట్ (సీవోడీ) బుధవారం విజయవంతంగా ముగిసింది. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ యూనిట్‌ను 72 గంటలపాటు నిర్విరామంగా నడిపారు. ఎలాంటి అటంకాలు, సమస్యలు లేకుండా ఈ యూనిట్ ఏకధాటిగా పూర్తిలోడ్తో నడిచింది. ఈ 72 గంటల్లో 57.60 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఏకంగా 58.525 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అయ్యింది. దీంతో సీవోడీ విజయవంతమైనట్టు టీజీజెన్కో అధికారులు ప్రకటించారు. టీజీ జెన్కో సీఎండీ హరీశ్ బుధవారం వైటీపీఎస్‌కు చేరుకుని, సీవోడీని పర్యవేక్షించారు. ఆ ప్రక్రియ విజయవంతమయ్యే వరకు ఆయన ప్లాంట్‌లోనే గడిపారు. హరీశ్‌తోపాటు టీజీజెన్కో డైరెక్టర్ రాజశేఖర్‌రెడ్డి, సీఈ రమేశ్‌బాబు తదితరులు సీవోడీని పర్యవేక్షించారు. నిజానికి యూనిట్-3లో సీవోడీ కంటే ముందే విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది. తాజాగా సీవోడీ ప్రక్రియ ముగియడంతో కమర్షియల్ ఆపరేషన్స్ షురూ అయినట్టే. దీంతో ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ రూపంలో టీజీజెన్కో ఆదాయాన్ని సమకూర్చుకోనున్నది.
3,200 మెగావాట్లకు చేరుకున్న విద్యుత్తు ఉత్పత్తి
వైటీపీఎస్‌లో 800 మెగావాట్ల చొప్పున సామర్థ్యం కలిగిన 5 యూనిట్లు ఉన్నాయి. వాటిలో ఇప్పటికే 3 యూనిట్ల ద్వారా 2,400 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది. తాజాగా 3వ యూనిట్లో సీవోడీ విజయవంతంగా పూర్తవడంతో నాలుగు యూనిట్ల ద్వారా 3,200 మెగావాట్ల విద్యుత్తు ఉత్పతి కానున్నది. ఇక ఈ ప్లాంట్‌లో మిగిలిన 5వ యూనిట్‌ను 3-4 నెలల్లో అందుబాటులోకి తెస్తామని టీజీజెన్కో అధికారులు తెలిపారు.
కేసీఆర్ కలల ప్రాజెక్టు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు అయిన వైటీపీఎస్ దక్షిణ భారత దేశంలోనే రెండో అతిపెద్ద పవర్‌ప్లాంట్. విద్యుత్తు రంగంలో తెలంగాణ ఎవరిపై ఆధారపడకుండా మిగులు రాష్ట్రంగా నిలువాలన్న సదాశయంతో కేసీఆర్ రూ.35 వేల కోట్లతో ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. మొత్తం 5 యూనిట్లు గల ఈ ప్లాంట్‌లో ఇప్పటికే మూడు యూనిట్లు విజయవంతంగా నడుస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి 12 వరకు యూనిట్-1లో 122.64, యూనిట్-2లో 297.11, యూనిట్-4లో 276.13, యూనిట్-3లో 343.78 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేశాయి. దేశంలో కొందామన్నా కరెంట్ దొరుకని ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణకు వైటీపీఎస్ వరప్రదాయినిగా మారింది. మార్చి నెలలో పీక్ డిమాండ్ 18 వేల మెగావాట్లు దాటినప్పుడు ఈ ప్రాజెక్టే రాష్ర్టాన్ని కారుచీకట్ల నుంచి బయటపడేసింది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo | సౌదీపై హౌతీ దాడుల ఎఫెక్ట్.. రియాద్, జెద్దా నుంచి విమానాలు రద్దు చేసిన ఇండిగో
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

