హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలను ఈ నెల 12న నిర్వహించనున్నట్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరహరి వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ చేపడుతామని, ఈ నెల 4న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించామని వెల్లడించారు.
6న నామినేషన్ల పరిశీలన, 7న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించినట్టు తెలిపారు. ఈ నెల 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని, సాయంత్రం 5 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి పదవులకు పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ సభ్యుడిగా పదవీకాలం పూర్తి చేసి ఉండాలని వివరించారు.