ఖమ్మం, ఏప్రిల్ 25 : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే తమ సత్తా ఏమిటో సీఎం రేవంత్‌రెడ్డికి చూపించాల్సి వస్తుందని టీజీఈ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు హెచ్చరించారు. అధికారంలోకి వచ్చి 16 నెలలైనా మంత్రుల పేషీల్లో ఇప్పటికీ ఉద్యోగ సంఘ నాయకులను గుర్తించడంలేదని తెలిపారు. అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
కలెక్టరేట్ నుంచి బయలుదేరిన ర్యాలీ నగరంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాలు వరకు కొనసాగింది. టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. రాష్ట్రంలో ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, బకాయిలు నెలకు రూ.650 కోట్ల చొప్పున చెల్లిస్తామని చెప్పి ఇప్పటివరకు రూపాయి కూడా విదల్చలేదని విమర్శించారు.