హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): మయన్మార్ సైబర్ క్రైమ్ క్యాంపులకు భారతీయులను అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు ఏజెంట్లను అరెస్ట్ చేసినట్టు టీజీసీఎస్బీ డీజీ శిఖాగోయల్ తెలిపారు. హైదరాబాద్, విశాఖపట్నం, మైసూర్‌కు చెందిన నిందితులను వాసం గోవర్ధన్, బానోత్ మదన్‌లాల్, మహ్మద్ సయ్యద్ మదానీ అలియాస్ మ్యాక్స్, సుగ్గన సుధీర్ కుమార్, గంగల నవీన్‌గా గుర్తించారు.
వీరంతా విదేశాల్లో అధిక జీతం ఆశ చూపి, నిరుద్యోగులను నమ్మించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బాధితులు శరణ్, సంగీరెడ్డి జీవన్‌రెడ్డి గత నెల 22న ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేసి, సిట్ ఏర్పాటు చేసి, అరెస్ట్ చేసినట్టు తెలిపారు.