సింగరేణి బరిలో టీబీజీకేఎస్
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) పోటీ చేస్తుందని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం సింగరేణి సంస్థ కోసం, కార్మికుల సంక్షేమం కోసం చేసిన పనులను చూసి కార్మికులు ఆత్మసాక్షిగా ఆలోచించి ఓటేసి టీబీజీకేఎస్ సంఘాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు.
- సింగరేణి సంస్థను కాపాడింది కేసీఆరే
- టీబీజీకేఎస్ విజయం సాధిస్తేనే కార్మికులకు న్యాయం జరుగుతుంది
- కార్మికులు ఆత్మసాక్షిగా ఆలోచించి ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటేయాలి
- సంస్థ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపు
హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) పోటీ చేస్తుందని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం సింగరేణి సంస్థ కోసం, కార్మికుల సంక్షేమం కోసం చేసిన పనులను చూసి కార్మికులు ఆత్మసాక్షిగా ఆలోచించి ఓటేసి టీబీజీకేఎస్ సంఘాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థను కేసీఆర్ కాపాడారని, లాభాలబాట పట్టించారని, టీబీజీకేఎస్ కార్మికుల హకులను సాధించిందని పునరుద్ఘాటించారు. కార్మికుల గొంతుక టీబీజీకేఎస్ బాణం గుర్తుపై ఓట్లేసీ భారీ మెజారిటీతో గెలిపించాలని సింగరేణి కార్మికులకు విజ్ఞప్తిచేశారు.
డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే
బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 20 వేల డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి యువతకు ఉపాధి కల్పించిందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. డిపెండెంట్ ఉద్యోగం వద్దనుకుంటే ఆ కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించాలన్న ఉదారమైన నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నారని తెలిపారు. కోల్ ఇండియా సంస్థలో సైతం లేని విధంగా కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్‌కే దకుతుందని వివరించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సింగరేణి నికర లాభాల్లో కార్మికులకు భారీ మొత్తంలో వాటాలను పంచారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిననాటికి లాభాల్లో కార్మికులకు వాటా కేవలం 18% ఉండగా, 32 శాతానికి పెంచారని గుర్తుచేశారు. కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ దవాఖానల్లో ఉచితం వైద్య సౌకర్యం కల్పించారని, సొంత ఇల్లు నిర్మించుకునే వారికి రూ.10 లక్షల రుణం వరకు సంస్థనే వడ్డీ భరించడం, ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల్లో చదువుకునే కార్మికుల పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ వంటి విప్లవాత్మక, కార్మిక సంక్షేమ నిర్ణయాలను అమలుచేశారని వివరించారు.
టీబీజీకేఎస్ గెలుపు సింగరేణి కార్మికుల జీవితాలకు మలుపు
కార్మికుల కోసం గతంలో ఎప్పుడూ లేనన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి సింగరేణిని కష్టాల నుంచి కాపాడిన బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్‌ను ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కవిత పిలుపునిచ్చారు. టీబీజీకేఎస్‌ను గెలిపించుకుంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని, కార్మికుల పక్షాన నిలబడే ఏకైక సంఘం టీబీజీకేఎస్ అని పేర్కొన్నారు. సంఘం నాయకత్వ బాధ్యతల్లో యువతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. గత పదేండ్లలో ఒక సమ్మె కూడా చేయనవసరం లేకుండా అన్ని డిమాండ్లు సాధించుకున్నామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

