థేమ్స్ నది తరహాలో మూసీ అభివృద్ధి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం సచివాలయంలో బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్‌తో సమావేశమయ్యారు. లండన్ పర్యటనపై ముచ్చటించారు.
- బ్రిటిష్ హైకమిషనర్‌తో సీఎం భేటీ
- లండన్ పర్యటనపై చర్చించిన రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం సచివాలయంలో బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్‌తో సమావేశమయ్యారు. లండన్ పర్యటనపై ముచ్చటించారు. లండన్‌లోని థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్‌లోని మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్టు తెలిపారు. ఇటీవలి తన లండన్ పర్యటనలో థేమ్స్ నది నిర్వహణ తీరు, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధిపై అధ్యయనం చేసినట్టు చెప్పారు.
అదే మాడల్‌లో మూసీ పునరుజ్జీవానికి తలపెట్టిన ప్రణాళికలను, ప్రాజెక్టు ఔట్‌లైన్ తదితర అంశాలను అలెక్స్‌తో చర్చించారు. మూసీనది పరీవాహక ప్రాంత అభివృద్ధి చేపట్టాలనే నిర్ణయం పట్ల బ్రిటిష్ హైకమిషనర్ హర్షం ప్రకటించారు. రాష్ట్రంలో సిల్ డెవలప్మెంట్, ఎకో టూరిజానికి తమ సహకారం ఉంటుందని ఎల్లిస్ తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్‌రెడ్డి, డిప్యూటీ హైకమిషనర్ గారోత్వైన్ ఓవెన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

