హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): విద్యత్తు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలోని కుదావన్పూర్లో కొత్తగా 400 కేవీ సబ్‌స్టేషన్‌ను టీజీ ట్రాన్స్‌కో నిర్మించనున్నది. ఇందు కోసం సర్వే నంబర్-98లో 84.34 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.
ఈ భూముల సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ నుంచి సర్కార్ మినహాయింపునిచ్చింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నుంచి కేతిరెడ్డిపల్లి సబ్‌స్టేషన్‌కు రెండు వరుసల విద్యుత్తు లైన్లను నిర్మించనునుండగా, భూసేకరణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.