TG TET 2025 | హైదరాబాద్ : టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్(TET) నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక దరఖాస్తుల ప్రక్రియ, తదితర వివరాలను సంబంధిత వెబ్సైట్లో ఈ నెల 15 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. టెట్ వివరాలు, దరఖాస్తు కోసం schooledu.telangana.gov.in అనే వెబ్సైట్ను లాగిన్ అవ్వాలి.