TG Rains | తెలంగాణలో రాబోయే రెండురోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న ద్రోణి.. ప్రస్తుతం కొమొరిన్ ప్రాంతం నుంచి ఇంటీరియర్ తమిళనాడు మీదుగా రాయలసీమ వరకు విస్తరించి ఉందని తెలిపింది. ఈ క్రమంలో ఆదివారం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వానలుపడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.