హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ) : మూడు, ఐదేండ్ల ఎల్ఎల్బీ కోర్సుల్లోని సీట్ల భర్తీకి మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ ఆగసు ్ట4 నుంచి ప్రారంభంకానున్నది. 26న అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. శుక్రవారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో అడ్మిషన్ల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. మండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ పురుషోత్తం, ఎస్కే మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి అడ్మిషన్ల షెడ్యూల్‌ను విడుదలచేశారు.
విద్యార్థులు ఆగస్టు 4 నుంచి 14 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 11 నుంచి 14 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఆగస్టు 15న అర్హుల జాబితా ప్రదర్శిస్తారు. 16, 17న వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 18న వెబ్ ఆప్షన్లు ఎడిట్ చేసుకోవచ్చు. 22న సీట్లు కేటాయిస్తారు. 22 నుంచి 25 వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. 30 నుంచి మొదటి సెమిస్టర్ క్లాసులు ప్రారంభమవుతాయి.